క్రిష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి… తెలంగాణకు న్యాయం చేయండని.. గజేంద్ర షెకావత్ ను కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. క్రిష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు బండి సంజయ్ కుమార్.
ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ న్యాయం జరిగే అవకాశం లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే.. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని.. తెలంగాణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేపత విజ్ఙప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఆ అంశం తన దృష్టిలో ఉందని తెలిపారు. ఇదే అంశం పై కేంద్రన్యాయ శాఖ మంత్రతో చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.