కెసిఆర్ కు బ్రోకర్ పనులు మాత్రమే తెలుసు : బండి సంజయ్ ఫైర్

-

హుజురాబాద్ : సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు..కెసిఆర్ కు బ్రోకర్ పనులు మాత్రమే తెలుసు అని చురకలు అంటించారు. గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటెలను ఓడించేది.. ఈటెల గెలిచిన తర్వాత డైరెక్ట్ గా అయోధ్యకు వెళతామని తెలిపారు.

సీఎం కేసీఆర్ కు ఈటెల పాదయాత్ర నిద్ర లేకుండా చేస్తోందని.. సర్వేల ను మాత్రమే కేసీఆర్ నమ్ముకున్నాడని ఫైర్ అయ్యారు. దళిత బంధును కేసీఆరే నిలిపేసి.. బీజేపీ మీదకు నెట్టేస్తాడని మండిపడ్డారు. పది లక్షలు ఇచ్చే దాకా బీజేపీ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసీఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు బండి సంజయ్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదీ ? అని సిఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల గెలుపును ఎవరు ఆపలేరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version