కర్ణాటకలో లాగే… తెలంగాణలోనూ అధికారం చేజిక్కించుకుందాం : బండి సంజయ్ సంచలనం

-

కర్నాటక తరహాలో ఉద్యమించి తెలంగాణలోనూ అధికారం చేజిక్కుంచుకుందామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…ఇంకెన్నాళ్లీ బాధలు…..తెగించి కొట్లాడదామన్నారు. తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోందని…కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారని…ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అని పేర్కొన్నారు.

అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.కర్నాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పారు.బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలని తెలిపారు. ఈనెల 24న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించనున్న ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని తనతో నడిచేందుకు సిద్ధం కావడం చాలా సంతోషంగా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version