కాసేపట్లో పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల‌ వద్దకు బండి సంజయ్‌..నెక్లెస్ రోడ్‌లో భారీ భద్రత.

-

కాసేపట్లో పీవీ నరసింహా రావు, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో సమాధుల కూల్చివేతల అంశం తెరపైకి రావడంతో గ్రేటర్‌ వార్‌ మరింత ఉద్రిక్తంగా మారింది..ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ గ్రేటర్‌లో అక్రమ కట్టడాలు, వాటి కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు..హైదరాబాద్‌లో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని..ముఖ్యంగా పాతబస్తీలో ఎక్కువగా ఉన్నాయన్న రాజకీయ పార్టీల ఆరోపణలపై స్పందించిన అక్బర్‌..ట్యాంక్‌ బండ్ గతంలో 1400 ఎకరాలు ఉండేనని ఇప్పుడు అది 700 ఎకరాలకు పరిమితం అయ్యిందని..ట్యాంక్‌ బండ్,నెక్లెస్ రోడ్‌లో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు అక్బర్‌..అంతే కాకుండా..పీవీ ఘాట్‌, ఎన్టీఆర్ ఘాట్ కూడా కూడా అక్రమ కట్టడమే అని విమర్శించారు.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చవలసి వస్తే అది పీవీ,ఎన్‌టీఆర్ ఘాట్ల నుంచి మొదలు పెట్టాలన్నారు..ముందు వాటిని కూల్చాలని డిమాండ్ చేశారు..అక్బర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ అధ్యక్షుడు అంతే ఘాటుగా విమర్శించారు నా హిందూ నాయకుల సమాధుల జోలికి వస్తే రెండు గంటల్లోనే దారుసలేం కూల్చుతాం అంటూ హెచ్చరించారు..అంతే కాకుండా రోజు ఎన్నికల ప్రచారం పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల నుంచే ప్రారంభిస్తామని వాగ్దానం చేశారు..కాసేపట్లో పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల వద్దకు బీజేపీ నేతలు వెళ్ళి నివాళులు అర్పించనున్నారు..దమ్ముంటే అక్బర్‌ వచ్చి ఘాట్‌లను కూల్చాలని సవాల్ విసిరారు..దీంతో నెక్లెస్ రోడ్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version