ప్రభుత్వం రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది..ఉద్యోగుల కోపానికి ఆహుతి కావద్దు : బండి శ్రీనివాసరావు

-

ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంబన తొలగిన తర్వాతే సబ్ కమిటీతో చర్చేందుకు వెళ్తామని.. శాంతియుతంగా ఉద్యోగులు నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేము పిలిచినా ఉద్యోగ సంఘాలు చర్చలకు రావటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం ఉద్యోగులను తీవ్ర మనస్ధాపానికి గురి చేసిందని పేర్కొన్నారు.

ఈ ప్రవర్తన సరికాదు.. ప్రభుత్వం సరిచేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ డీడీఓలకు ఉద్యోగులు తమకు పాత జీతాలని ఇవ్వాలని రిప్రజంటేషన్సు ఇస్తున్నారు..ప్రతీ ఉద్యోగికి తాము ఏ పీఆర్సీ ప్రకారం జీతం తీసుకోదలచుకున్నారో చెప్పే హక్కు ఉందన్నారు.కలెక్టర్లు జీతాల విషయంలో డీడీఓలపై ఒత్తడి తీసుకురావద్దు..ఉద్యోగుల కోపానికి కలెక్టర్లు ఆహుతి కావద్దని హెచ్చరించారు.

నిబందనలకు తిలోదకాలు ఇచ్చేలా కొందరు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదు..ఈ సమయంలో ప్రభుత్వం కావాలనే జిల్లాల పునర్వవస్దీకరణను తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాత జీతం మీద కొత్త డీఏలు వేస్తే జీతాలు ఎంత తేడాలు వస్తాయో ప్రభుత్వానికి అర్దం అవుతుంది..ప్రజలు ఉద్యోగులు జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నారనటం కరెక్టు కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version