బండ్ల గణేష్ అల్లు అర్జున్ ను పొగిడాడా! అరవింద్ ను తిట్టాడా.!

-

కమేడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి అటు తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించాడు టాలీవుడ్‌ యాక్టర్‌ బండ్ల గణేష్‌. ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌లలో పాల్గొంటూ పవన్ ను విపరీతంగా పొగుడుతూ తాను హైలైట్ అవుతూ ఉంటాడు. ఇక మనోడు కొన్ని రోజులు రాజకీయాల్లో వెళ్లి చేతులు కాల్చుకొని వచ్చాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో బండ్ల గణేష్‌, అల్లు బాబీతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ ‘అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా  పాన్ ఇండియా స్టార్ అవుతారు. అనే మంట పెట్టే కామెంట్స్ చేసారు. దీనితో చాలా మంది బండ్ల గణేష్ పై కామెంట్స్ తో విరుచుకు పడటం స్టార్ట్ చేసారు.

కాని మరికొంత మంది ఆయన అల్లు అరవింద్ ను తిట్టాడా, అర్జున్ ను పొగిడాడా అని ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. మరి కొంత మంది వేరే వారి మీద ఆధారపడి వుండకుండా స్వంత నిర్ణయాల మీద ఆధార పడాలి అని అన్నాడని దానిలో తప్పేముంది అంటున్నారు. అసలు బండ్ల గణేష్ మనుసులో ఏమనుకొని ఇలా అన్నాడో తెలియదు.  ఏది ఏమైనా మరో సారి బండ్ల తన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version