బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత ఆయన బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేసారు. వారం రోజుల నుండి కేటీఆర్ మైకు పట్టుకుంటే ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే భయం వేస్తుంది అన్నారు ఆయనని చూస్తుంటే బాధ కూడా అవుతుందని ఒక వీడియోని రిలీజ్ చేశారు, ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతా అంటారని త్వరలో సీఎం కేసిఆర్ అవుతారని కేటీఆర్ వ్యాఖ్యలను బండ్ల గణేష్ గుర్తు చేశారు. అయితే వచ్చే ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేయండి అని ఎవరికి అభ్యంతరం లేదు అని అన్నారు.
ఇంకో వైపు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా బలపడాలని అయినా అన్నారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తేనే కేటీఆర్ ఉలిక్కిపడి నిద్రపోకుండా ఆగమాగం అయిపోయి ఏదో కొంపలు మునిగిపోయినట్లు భయపడుతున్నారని అన్నారు. ఎందుకు భయపడటం మీరు స్క్రిప్ట్ రాసిచ్చి చదవమని చెప్పండి అని విమర్శించారు.