కమేడియన్‌గా కెరీర్ ప్రారంభించి అటు తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు టాలీవుడ్ యాక్టర్ బండ్ల గణేష్. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్లలో పాల్గొంటూ పవన్ ను విపరీతంగా పొగుడుతూ తాను హైలైట్ అవుతూ ఉంటాడు. ఇక మనోడు కొన్ని రోజులు రాజకీయాల్లో వెళ్లి చేతులు కాల్చుకొని వచ్చాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశాడు. వారికి వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటూ ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేశారు బండ్ల.
పదేపదే వ్యక్తులతో మోసపోతున్నామంటే అది మోసం చేసేవాళ్ళ తప్పు కాదు.. నమ్ముతున్న మనందరి తప్పు. సరే కదా అని మౌనంగా ఉన్నామంటే..అది ఇంకా తప్పు. మోసం చేసినోడి గురించి తెలుసుకోండి.. వాడికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి. దేనికైనా సమాధానం ఒక్కటే సరైన నిర్ణయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.
పదేపదే వ్యక్తులతో మోసపోతున్నామంటే అది మోసం చేసేవాళ్ళ తప్పు కాదు.. నమ్ముతున్న మనందరి తప్పు. సరే కదా అని మౌనంగా ఉన్నామంటే..
అది ఇంకా తప్పు. మోసం చేసినోడి గురించి తెలుసుకోండి.. వాడికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి. దేనికైనా సమాధానం ఒక్కటే సరైన నిర్ణయం..— BANDLA GANESH. (@ganeshbandla) December 22, 2022