పవర్ స్టార్‌తో సినిమా తీస్తానని నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. మన పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా నిర్మించి బండ్ల గణేష్ మంచి లాభాలు గడించారు.
ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను.మన పవర్ స్టార్ అభిమానులు ఈ సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా ఇది నా సంకల్పం https://t.co/mSWeTdHTgA
— BANDLA GANESH. (@ganeshbandla) July 19, 2020
ఈ క్రమంలోనే మరోసారి పవన్‌తో సినిమా చేసే అవకాశం కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్లు చెప్తూ.. గబ్బర్ సింగ్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ట్యాగ్ చేస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై రెగ్యులర్‌గా స్పందిస్తున్న బండ్ల గణేష్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు.