BREAKING : ఏపీలో తెరుచుకొనున్న స్కూళ్ళు..! ఎప్పటినుంచో తెలుసా.!

-

రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అయితే మొదట ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని కేంద్రానికి తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు వివరించింది. మరోవైపు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

స్కూల్స్ సురక్షిత ప్రణాళికపై ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పాలని ఈ సందర్భంగా కోరింది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను వివరించారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version