బెంగళూరు పోలీసులు ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. కోవిడ్‌పై పోరాటం చేసేందుకు, జనాలకు సహాయం అందించేందుకు, ఇతర సేవలకు గాను సివిల్ పోలీస్ వార్డెన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు వివరాలను వెల్లడించారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, శారీరకంగా ఫిట్ ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా సరే సివిల్ పోలీస్ వార్డెన్లుగా సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు గాను అభ్యర్థులు https://bcp.gov.in అనే సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో కంప్లీట్ లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు అక్కడ ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14 నుంచి అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది.