ఒక నెల ఒకరికి.. రెండో నెల ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ.. నెలరోజులలో ముగ్గురు..!

-

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం చూశారు కానీ.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనివ్వకుండా.. గ్యాప్ లో జన్మనివ్వడం ఎక్కడైనా చూశారా?

కవలలు అంటే అర్థం ఏంటి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఒకే కాన్పులో జన్మించడం. కానీ… ఈ మహిళ మాత్రం ముందు ఒక బిడ్డను తర్వాత నెల రోజులకు కవలలకు జన్మనిచ్చింది. విచిత్రంగా ఉంది కదా. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని ఖుల్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. 20 ఏళ్ల అరిఫా సుల్తానా గత నెల 25న మగబిడ్డకు జన్మనిచ్చింది.


తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే… తర్వాత 26 రోజులకు ఆమెకు మళ్లీ నొప్పులు రావడం ప్రారంభించాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ మార్చి 22న కవలలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటనను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఆమెకు మొదట కాన్పు జరిగినప్పుడు కడుపులో కవలలు ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించలేదు. ఆమెకు రెండు గర్భాశయాలు ఉండటం వల్లనే ఇలా రెండు గర్భాశయాల్లో పిండాలు ఏర్పడ్డాయని డాక్టర్లు తెలిపారు.


అయితే.. ఇలా రెండు గర్భాశయాలు ఉండటం చాలా అరుదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version