తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బంజారాలకు (ఎస్టీ)లకు అవకాశం కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ కేంద్ర మంత్రి, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కోరారు. శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కాంగ్రెస్ ఎంపీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. హథీరాంజీ మఠానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని గుర్తుచేశారు.
ఆ భూముల రక్షణకు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. హథీరాంజీ మఠంలో బంజారాలకు వసతులు కల్పించాలని, మఠం పర్యవేక్షణకు కమిటీ వేయాలని సూచించారు. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశమివ్వడం చాలా మంచి పరిణామమని, అందుకు ధన్యవాదాలు తెలిపారు.టీటీడీ బోర్డులో బంజారాలకు ఎవరికి అవకాశమిచ్చిన అంగీకారమేనని అన్నారు. వీలైనంత త్వరగా ఓ బంజారా సభ్యుడిని బోర్డు మెంబర్‌గా నియమించాలని చంద్రబాబు నాయుడిని కోరారు.