ఫిబ్రవరి నెలలో అడుగేశాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు నెలలో వచ్చే సెలవుల వివరాలు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకుల సెలవు దినాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. బ్యాంకుల పనిదినాలు, వినియోగదారులకు తమ సమయాన్ని ఆదా చేసుకునే విధంగా పనిరోజుల వివరాలను వెల్లడించింది. ఈ నెలలో బ్యాంకులకు సెలవుల వివరాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.
ఫిబ్రవరిలో మీకు బ్యాంకులో ఏవైనా పనులు ఉన్నాయా.. అయితే మీరు కచ్చితంగా బ్యాంకు హాలీడేస్ వివరాలు తెలుసుకోవాలి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. కేవలం ఒక నెలలో ఆరు రోజులు మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఫిబ్రవరిలో 28 ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలో 6 రోజులు మాత్రమే బ్యాంకులు తెరుచుకోవు. మిగతా 22 రోజులలో బ్యాంకుల సెలవు దినాలను ప్రకటించింది. ముఖ్యమైన పనులు ఉన్నవారు ఈ వివరాలు తెలుకుంటే బాగుంటుంది.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పండుగ రోజులు, వీటితోపాటు బ్యాంకులకు అదనంగా సెలవులు వస్తుంటాయి. కానీ ఫిబ్రవరిలో అలాంటి సెలవులు ఏమీ లేవు. అయితే 2021 ఫిబ్రవరిలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు ఏఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకోండి. ఫిబ్రవరిలో వచ్చే సెలవులు ఆదివారం-7, రెండో శనివారం-13, ఆదివారం-14, ఆదివారం-21, నాలుగో శనివారం-27, ఆదివారం-28.. ఈ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
హైదరాబాద్ సర్కిల్ లో సెలవుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన వసంత పంచమి నాడు సెలవు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సెలవులు లేవు.. కేవలం హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే సెలవు ప్రకటించారు. బ్యాంకుల సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో వివరాలను వెల్లడించారు.