వాహనదారులకు గుడ్ న్యూస్.. చౌక వడ్డీలకే రుణాలు..!

-

మీరు టూవీలర్ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక లోన్ కి సంబందించిన విషయాలని తెలుసుకోవాలి. బైక్ ని కానీ స్కూటర్ ని కొనాలని అనుకుంటే తప్పక ఏ బ్యాంక్ లో ఎంత వడ్డీకి లోన్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఈజీగా టూ వీలర్ ని బ్యాంక్ నుంచి సులభంగానే రుణం పొందొచ్చు. పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి. ఇక వాటి వివరాలని చూస్తే.. బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే టూవీలర్ రుణాలు ఇస్తోంది. వడ్డీ రేటు 6.85 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది.

అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 7.25 శాతం వడ్డీ రేటుకి ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో PNB టూవీలర్ రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. ఇది ఇలా ఉంటే కెనరా బ్యాంక్‌ లో టూవీలర్ లోన్ పొందాలంటే వడ్డీ రేటు 9 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్‌ లో వడ్డీ రేటు 9.9 శాతంగా ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 12 శాతం వరకు వడ్డీ పడుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టూవీలర్ లోన్ మంచిది. రూ.లక్ష రుణ మొత్తానికి ఈఎంఐ రూ.3081 నుంచి స్టార్ట్ అవుతుంది. గరిష్టంగా రూ.3320 వరకు పడుతుంది. లోన్ టెన్యూర్ మూడేళ్లు. ఇలా టూ వీలర్ ని బ్యాంక్ నుండి లోన్ తీసుకుని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version