చాలా మంది విలువైన డాక్యుమెంట్స్ ని లాకర్ లో పెడుతూ వుంటారు. అలానే గోల్డ్ వంటి వాటిని కూడా బ్యాంక్ లాకర్లలో పెడుతూ వుంటారు. అయితే ఇలా ఈ సేవలని పొందే వాళ్ళు కొంత అమౌంట్ ని పే చెయ్యాల్సి వుంది. అయితే తాజాగా ఆరు బ్యాంకులు బ్యాంక్ లాకర్ ఫీజులను పెంచాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్, కెనరా బ్యాంక్, పీఎన్బీ లాకర్ ఫీజును విడుదల చేశాయి.
రూ.9,000 నుంచి రూ.12,000కు ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాకర్ల ఫీజును పెంచాయి. ఇక ఏయే బ్యాంకు ఎంత వసూలు చేస్తోంది అనేది చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ సైజు ఆధారంగా బ్యాంక్ లాకర్ ఫీజులను వసూల్ చేస్తోంది. రూ.500 నుంచి రూ.3,000 వరకు వున్నాయి. మెట్రో, మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే అదనపు పెద్ద సైజు లాకర్లకు రూ.2,000, రూ.4,000, రూ.8,000, రూ.12,000 వసూలు చేస్తుంది. రూ.1,500, రూ. 3,000, రూ. 6,000, రూ. 9,000 ఫీజులను తీసుకుంటోంది స్టేట్ బ్యాంక్.
అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కి అయితే సంవత్సరానికి రూ. 3,000 నుంచి రూ. 20,000 వరకు పే చెయ్యాలి. ఇంకా పెద్ద లాకర్లకు రూ. 10,000 చొప్పున వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ లాకర్స్ కి అయితే రూ. 1,200 నుంచి రూ. 5,000 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ వసూల్ చేస్తోంది. అదే అదనపు పెద్ద లాకర్‌కు రూ. 10,000 నుంచి రూ. 22,000 వరకు వసూలు చేస్తోంది ఈ బ్యాంకు. ఇక పీఎన్‌బీ బ్యాంక్ లాకర్ ఛార్జ్ల గురించి చూస్తే గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో రూ.1250 నుంచి రూ.2000 వరకూ ఉండగా పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.10,000 వరకు వసూలు చేస్తోంది. యాక్సిస్, కెనరా బ్యాంక్స్ అయితే లాకర్ రిజిస్ట్రేషన్ కోసం రుసుము రూ.1000 + GST. వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 400 ప్లస్ జీఎస్టీగా వుంది. ఫ్రీగా ఏడాదికి మూడుసార్లు మాత్రమే తీసుకోవాలి.