దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మహమ్మారి కారణంగా చాల మంది ఇంట్లో నుండి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ఉపాధిని కోల్పోయారు. అయితే వారికీ అండగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు పలు పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పలు పథకాల కింద నిరుద్యోగులకు, రైతులకు అండగా నిలబడుతూ వస్తున్నాయి. ఇక ముందే ఇది పండగ సీజన్ కావడంతో చాల మంది డబ్బులు లేక వెనుకడుగు వేస్తున్నారు. అయితే తాజాగా బ్యాంక్ అఫ్ బరోడా కూడా అదే జాబితాలోకి చేరింది.
ఇక పండుగల వాతావరణం నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి బ్యాంకులు. ఇక జాబితాలోకి తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచిందని నిపుణులు తెలిపారు. ఇక గృహ, కారు రుణ గ్రహీతలకు పలు ప్రోత్సాహకాలను మంగళవారం ప్రకటించినట్లు తెలిపారు. అయితే బ్యాంక్ ప్రకటన ప్రకారం.. బరోడా గృహ రుణాలు, బరోడా కారు రుణాలకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వడ్డీరేటుపై పావుశాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అయితే ఎస్‌బీఐ ఇప్పటికే పండుగ ఆఫర్లను ప్రకటించిందని పేర్కొన్నారు. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100% మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికీ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని నిపుణులు తెలియజేశారు.