తెలంగాణలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నట్లు కమిటీ తెలిపింది.
కాగా ఆదివారం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ గడువు పొడగించడంతో పాటు సడలింపు సమయాన్ని కూడా పొడిగించింది. నిన్నటి వరకు ఉదయం 10 వరకు మాత్రమే సడలింపు ఉండగా… దానిని మరో మూడు గంటలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధాహ్నం ఒంటి గంట వరకు సడలింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. అలానే సడలింపు సమయంలో బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు వీలు కల్పించింది.
దీంతో లాక్‌డౌన్ సడలింపు వేళల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. సడలింపు వేళలకు అనుగుణంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా నిన్నటి వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంక్‌లు పని చేసాయి. కమిటీ తాజా నిర్ణయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.