జూలై నెల ముగుస్తోంది. ఆగస్టు నెల వచ్చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు చేసుకునే వారికి బిగ్ అలర్ట్. ఆగస్టు మాసంలో.. వరుసగా బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. దాదాపు తొమ్మిది రోజులపాటు.. బ్యాంకులకు సెలవులు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే అలాగే రక్షాబంధన్ పండుగ రానుంది.
ఇలాంటి తరుణంలో హాలిడేస్ ఎక్కువగా రాబోతున్నాయి. రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు ఎప్పటిలాగానే హాలిడేస్ ఉంటాయి. అలాగే ఇండిపెండెన్స్ డే 15వ తేదీన రాబోతుంది. ఇండిపెండెన్స్ డే రోజున గురువారం అవుతుంది. రక్షాబంధన్ 19వ తేదీన వస్తుంది. అంటే ఆ రోజున సోమవారం అవుతుంది. అంటే ఇండిపెండెన్స్ అలాగే రక్షాబంధన్ రోజు బ్యాంకులు బంద్ అవుతాయి. ఆగస్టు 26వ తేదీ న జన్మాష్టమి ఉంది ఆ రోజున కూడా బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇలా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆగస్టులో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.