అతి తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్న బ్యాంకులు వివరాలు మీకోసం..!

-

ఆర్థిక స్థోమత వలన విద్యార్థులు చదువుకోవడం మానేయకూడదు అని ఉన్నత విద్యని కొనసాగించేందుకు ఇబ్బందులు రాకూడదని.. బ్యాంకులు విద్యా రుణాలను అందజేస్తున్నాయి. అయితే తక్కువ రేటుకే అందజేస్తుండటం విశేషం. అయితే ఏ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలని ఇస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

money

బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వడ్డీకే రూ. 20 లక్షల వరకు విద్యా రుణాన్ని ఇస్తోంది. ఏడు సంవత్సరాల కాలపరిమితితో ఈ లోన్ ని ఇవ్వడం జరుగుతోంది. అలానే ప్రభుత్వ రంగ బ్యాంక్​ యూనియన్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 6.8 శాతం వద్ద విద్యారుణాలను అందజేస్తుంది. రూ. 20 లక్షల రుణానికి ఏడేళ్ల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 29,990 నెలవారీ ఈఎంఐ కట్టాలి.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ , సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా​లు 6.85 శాతం వడ్డీ రేట్లతో విద్యా రుణాలు అందజేస్తున్నాయి. రూ. 20 లక్షల రుణానికి ఏడేళ్ల వ్యవధిని పరిగణన లోకి తీసుకుంటే రూ. 30,039 చొప్పున నెలవారీ ఈఎంఐ పే చెయ్యాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్​లు రూ. 20 లక్షల విద్యా రుణాన్ని 6.9 శాతం వడ్డీ రేటుకి ఇస్తున్నాయి. అలానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.05 శాతం వడ్డీరేటు కి లోన్ ని ఇస్తోంది. ఏడేళ్ల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 30,234 చెల్లించాలి. అలానే ఇండియన్ బ్యాంక్ రూ. 20 లక్షల విద్యార్థి రుణానికి 7.15 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version