ఎస్‌బీఐ 3 ఇన్‌ 1 అకౌంట్ గురించి మీకు తెలుసా…? కలిగే లాభాలివే…!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే స్టేట్ ఇచ్చే సేవల్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. అయితే స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ మాత్రమే కాకుండా పలు రకాల ఖాతాలు కూడా ఉన్నాయి.

 

SBI
SBI

అవే కరెంట్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ వంటివి. అదే విధంగా స్టేట్ బ్యాంక్ మరో రకం అకౌంట్ సేవలు కూడా ఇస్తోంది. అదే 3 ఇన్ 1 అకౌంట్. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ అకౌంట్ ద్వారా మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు.

అవే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ అకౌంట్. ఈ మూడింటినీ కూడా దానితో పొందొచ్చు. మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతుంటే ఇది మీకు బాగుంటుంది. సేవింగ్స్ అకౌంట్‌తోపాటు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు కూడా లభిస్తాయి.

షేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటే ఇది బెస్ట్. ఈ ఖాతా ఓపెన్ చెయ్యాలంటే . పాన్ కార్డు లేదా ఫామ్ 60, ఫోటోలు, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా క్యాన్సల్డ్ చెక్, ఆధార్ కార్డు అవసరం. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, జాబ్ కార్డు వంటి వాటిల్లో ఏదైనా ఒకటి అవసరం అవుతుంది. ఇలా ఈ ఖాతా తో ఖాతాదారులు ఈ లాభాలని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news