క్రెడిట్ స్కోర్ తగ్గిందా..? అయితే కారణం తెలుసుకోండి..!

-

బ్యాంకులు క్రెడిట్ అర్హతను చూస్తాయి. క్రెడిట్ అర్హతను తెలుసుకోవడానికి క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. క్రెడిట్ రిపోర్ట్ పరిశీలించేటప్పుడు రుణగ్రహీతలు శ్రద్ధగా చూడాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీ క్రెడిట్ అర్హతను అంచనా వేసేటప్పుడు యాక్టివ్ గా ఉన్న, క్లోజ్ చేసిన మీ క్రెడిట్ ఖాతాలు క్రెడిట్ రిపోర్ట్ లోని క్రెడిట్ అకౌంట్స్ సెక్షన్ లో లిస్ట్ అయ్యి ఉంటాయి గమనించండి.

 

అందుకే మీ లోన్, క్రెడిట్ కార్డ్ ఖాతా వివరాలు తప్పులు లేకుండా రిపోర్ట్ లో కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలి. లేదు అంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అలానే ఈ సెక్షన్ లో మీ రుణం, క్రెడిట్ కార్డుల రీపేమెంట్ హిస్టరీ లిస్ట్ అయి ఉంటుంది. ఇందులో గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించిన నెలలు వంటివి ఉంటాయి. కనుక మీ క్రెడిట్ రిపోర్టులో రీపేమెంట్ హిస్టరీ వివరాలు కచ్చితంగా అప్‌డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి.

అలానే మీ క్రెడిట్ రిపోర్ట్ లోని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేస్తాయి. అందులో వుండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సరైనది అయ్యి ఉండాలి. కనుక ముందే చెక్ చేసుకోండి. ఇది ఇలా ఉంటే మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు రుణదాతలు మీ క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత మొత్తం వినియోగించారనేది తెలుసుకుంటారు.

30 శాతం లోపు సీయూఆర్‌ ఉన్న వ్యక్తులకే లోన్స్ వస్తాయి. అలానే రుణం కోసం ఆశ్రయించే బ్యాంకుల వివరాలు లిస్టు అయి ఉంటాయి. ఇందులో రుణదాత పేరు, దరఖాస్తు చేసిన తేదీ, దరఖాస్తు చేసుకున్న క్రెడిట్ మొత్తం వివరాలు ఉంటాయి. కనుక తక్కువ సమయంలోనే అనేక బ్యాంకులలో రుణాల కోసం రిక్వెస్ట్ పెట్టకండి. లేదా ఆన్లైన్ లో సాఫ్ట్ ఎంక్వయిరీస్ చేయడం ఉత్తమం. దీనివల్ల క్రెడిట్ కార్డు స్కోరుపై ఎలాంటి ప్రభావం పడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version