ఎస్‌బీఐ నుంచి కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ..!

-

స్టేట్ బ్యాంక్ ఎన్నో రకాల సేవలని తమ కస్టమర్స్ కి అందిస్తోంది. అలానే ఈ మధ్య కాలంలో ఎస్‌బీఐ అందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ముఖ్యంగా టర్మ్ పాలసీలను ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఎస్‌బీఐ తన టర్మ్ పాలసీ ఈ-షీల్డ్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

 

SBI

అయితే దీని స్థానంలో ఈ-షీల్డ్‌ నెక్స్ట్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఇది నాన్- లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండి విడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే పూర్తిగా రిస్క్ ప్రీమియం ప్రొడక్ట్. అయితే వ్యక్తి జీవితంలో వివాహం చేసుకోవడం, సంతానం పొందడం లేదా ఇల్లు కొనుగోలు చేయడం లాంటి వాటిని చేరుకున్నప్పుడు దానికి తగ్గట్టు అదనపు రక్షణను, ఆర్థిక భరోసాను అందిస్తుంది.

దీనిలో లెవల్ కవర్, కవర్‌ను పెంచడం, భవిష్య ప్రయోజనాల కోసం లెవల్ కవర్ చేయడం లాంటి ఆప్షన్లు ఉన్నాయి. నిర్దిష్ట అవసరాలకు తగినట్లుగా ఓ ప్లాన్ ను రూపొందించారు. అలానే ఒక్కో ఆప్షన్ ని బట్టి ఒక్కో బెనిఫిట్ కలుగుతుంది. మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా ప్రీమియం చెల్లించవచ్చు. అంటే ఒక్కసారిగా లేదా లిమిటెడ్ టైమ్ లో లేదా పాలసీ వ్యవధిలో పేమెంట్ చేయవచ్చు. ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్‌ నెక్స్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ కుటుంబ ఆర్థిక భద్రతకు హామీ ఇస్తుంది. ఇందులో మూడు ఆప్షన్ల నుంచి ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version