బ్యాంక్ కస్టమర్లకు రిజర్వు బ్యాంక్ తీపికబురు..!

-

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగింది. ఫీచర్ ఫోన్లకు కూడా డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ UPI ఆధారిత ప్రొడక్ట్స్‌ను ఫీచర్ ఫోన్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలానే రాబోయే కాలంలో ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపులు కూడా జరిగేటట్టు కనపడుతోంది. యూపీఐ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్స్ వ్యవస్థ. అంటే చాలా మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. చిన్న విలువలోని లావాదేవీలకు యూపీఐ ఎక్కువగా వాడుతున్నారు అని అన్నారు.

అలానే డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి ఫీచర్ ఫోన్ల కోసం యూపీఐ ఆధారిత పేమెంట్ వ్యవస్థలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం అని శక్తికాంత్ దాస్ చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPO, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ లో డబ్బులు పెట్టడానికి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌తో పాటు యూపీఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా కూడా ఐపీవోకు ఎక్కువగా డబ్బులు చెల్లించొచ్చు. అలానే ఇతర వాటిల్లో కూడా చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version