దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని ఇస్తోంది. వీటి వలన చాలా రకాల ప్రయోజనాలని పొందొచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి లోన్స్ వరకు ఇలా ఎన్నో సర్వీసులని ఇస్తోంది స్టేట్ బ్యాంక్. అయితే స్టేట్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ RD సేవలు కూడా ఇస్తోంది. దీని వలన కస్టమర్స్ కి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడం వలన చాలా బెనిఫిట్ ని పొందొచ్చు. ఈ ఖాతా తెరవడం వల్ల దీర్ఘకాలంలో ఒకేసారి ఆకర్షణీయ మొత్తాన్ని పొందొచ్చు. అలానే ప్రతీ నెలా కూడా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి.
పదేళ్ల వరకు కాల పరిమితితో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. దీనిలో రూ.100 నుంచి కూడా దాస్తూ ఉండచ్చు. అలానే ఎలాంటి లిమిట్ కూడా లేదు. దీనిలో ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతుంది.
ఐదేళ్లలోపు ఆర్‌డీ ఖాతాలకు 5.3 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలకు అయితే 5.4 శాతం వడ్డీ వస్తుంది. ఎస్‌బీఐ ఆర్‌డీ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు రూ.1000 డిపాజిట్ చేస్తే.. పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్ ని చేస్తే చేతికి ఒకేసారి దాదాపు రూ.1,60,000 వరకు వస్తాయి.