సూపర్ స్కీమ్..రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా లోన్..!

-

కొత్త స్కీమ్ ని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన పీఎన్‌బీ తీసుకు వచ్చింది. రోష్ని పేరుతో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. అర్హత కలిగిన వాళ్లకి రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా హోమ్ లోన్ వస్తుంది. ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలను చూస్తే..

ఈ స్కీమ్ కింద రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా హోమ్ లోన్ ని పొందవచ్చు. టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలని కట్టుకోలేక పోతుంటే ఈ స్కీమ్ వారికి బాగా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్ , ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పుణే, చెన్నై, కోయంబత్తూరు, ఘజియా బాద్, రాజ్‌ కోట్, వారణాసి లో వారికి ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది.

మొదటి సారి లోన్ తీసుకునే వారు రూ.10 వేల నుంచి ఈ రోష్ని స్కీమ్ కింద లోన్ తీసుకోచ్చు. భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలని తీసుకు రానున్నారు. సామాన్యులు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి రోష్ని ని తీసుకు వచ్చినట్టు సీఈవో గిరీశ్ కౌస్గి అన్నారు. ఇదిలా ఉంటే పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఇంటి రుణాలని ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version