కేవలం పక్షి వల్లే ఇది జరిగిందా..ఒళ్ళు గగూర్పొడిచే వీడియో..

-

ప్రమాదాలు ఎటు వైపు నుంచి వస్తాయో, మృత్యువు ఎక్కడ కబలిస్తుందొ చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు..తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది… అది ఓ భయంకర ఘటన.. రైల్వే స్టేషన్‌లో సరదాగా మరొక వ్యక్తితో మాట్లాడుతున్న టీటీఈకి కరెంట్ వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.. ప్రస్తుతం అతను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన అందరినీ ఆందోళనకు గురిస్తోంది.

కరెంట్ వైర్ ప్లాట్‌ఫాం మీదకు ఎందుకు ఉంది.. ప్రమాదం ఎలా జరిగింది అనే సందేహం చాలా మందికి రావొచ్చు.. కానీ ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ పక్షి గూడు కోసం పొడవైన వైర్‌ తీసుకెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చేరుకోగానే.. ఆ వైర్ హైవోల్టేజీ విద్యుత్‌ లైన్‌కు తగిలింది. ప్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొని ఉన్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) కి ఆ వైర్‌ తాకింది. దీంతో టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్‌ఫామ్‌ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాలపై పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా పరుగులు తీశారు.

ఏదో శక్తీ ఆపినట్లు అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు..ప్రాణాలతో బయట పడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో అంతా భయపడిపోతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొన్న టీటీఈ.. మరొక వ్యక్తితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక విద్యుత్‌ వైర్‌ ఆయనకు తాకింది. దీంతో అతను ప్లాట్‌ఫామ్‌ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కకు పడిపోయాడు.

అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది అతన్ని పైకి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.అయితే, టీటీఈకి ప్రాణాపాయం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. విద్యుదాఘాతం వల్ల ఆయనకు గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు..ఏది ఏమైనా ఇతడికి అదృష్టం ఎక్కడో ఉంది..ఆ వీడియోను మీరు చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version