ఈ బ్యాంకులు ష్యూరిటీ లేకుండా రూ.5,00,000 వరకు అప్పు ఇస్తున్నాయి…!

-

కరోనా మహమ్మారి వలన ఎన్నో ఇబ్బందులు వస్తూనే వున్నాయి. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. అయితే రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. ఈజీగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి రూ.5,00,000 వరకు పర్సనల్ లోన్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కరోనాని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కనీసం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు రుణాలు తీసుకో వచ్చు.

 

పైగా ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. వెంటనే చెల్లించాల్సిన అసరం లేదు. ఐదేళ్ల గడువు ఉంటుంది. మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ కట్టక్కర్లేదు. కోవిడ్-19 సంబంధిత చికిత్స కోసం ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. అయితే పాజిటీవ్ వచ్చినట్టు రిపోర్ట్ ఇవ్వడంతో పాటు కోవిడ్ 19 చికిత్స కోసం ఎలా ఖర్చు చేయబోతున్నారన్న వివరాలు కూడా తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే లోన్ వస్తుంది.

గత 12 నెలలుగా సంబంధిత బ్యాంకులోని అకౌంట్‌లో సాలరీ క్రెడిట్ కావాలి. ఇప్పటికే ఆ బ్యాంకులో రీటైల్ లోన్ తీసుకున్నవారు కూడా మరోసారి దరఖాస్తు చెయ్యచ్చు. సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చెయ్యడం ముఖ్యం. PNB Sahyog RIN COVID పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్స్ ఇస్తోంది. వడ్డీ రేటు 8.5 శాతం. వేతనానికి 6 రెట్లు లేదా రూ.3,00,000 వరకు రుణం పొందొచ్చు.

స్టేట్ బ్యాంక్ అయితే 8.5 శాతం వడ్డీ రేటుకు రుణాలను ఇస్తున్నాయి. కనీసం రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 8.5 శాతానికి పర్సనల్ లోన్ ఇస్తోంది. ఐదేళ్ల లోపు రుణాలు తిరిగి చెల్లించాలి. కెనెరా బ్యాంకు సురక్ష పర్సనల్ లోన్ పేరుతో రుణాలు ఇస్తోంది. రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లోన్స్ ని ఇస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version