అవును… వరుసగా బ్యాంకులకు సెలవులొచ్చాయ్. ఇవాళ్టి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవాళ ఏఐబీవోసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఏఐబీవోసీ అంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తోంది. దీంతో ఇవాళ బ్యాంకులు బంద్. రేపు 22న రెండో శనివారం, 23న ఆదివారం బ్యాంకులకు సెలవు. అంటే వరుసగా ఇవాళ, రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్. మళ్లీ సోమవారం బ్యాంకులు తెరుచుకుంటాయి కానీ.. ఆరోజు ఆప్షనల్ హాలీడే. అన్ని బ్యాంకులు తెరుచుకోకపోవచ్చు. తెరుచుకున్నా… పూర్తిస్థాయిలో లావాదేవీలు జరుగకపోవచ్చు. 25న క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు. 26 వ తారీఖున యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చాయి. అంటే ఆరోజు కూడా బ్యాంకులు బంద్. దీంతో శుక్రవారం నుంచి బుధవారం వరకు వరుసగా బ్యాంకులు బంద్ అవనున్నాయి. బ్యాంకుల వరుస సెలవుల నేపథ్యంలో ఏటీఎంలలో కస్టమర్లకు సరిపడా డబ్బులు నిల్వ చేయనున్నట్టు బ్యాంకు అధికారులు వెల్లడించారు.