బసవతారకం ఆస్పత్రికి అవార్డుల పంట… బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా…!

-

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆస్పత్రికి ఉత్తమ అవార్డ్ లు రాగా దానిపై బాలకృష్ణ స్పందించారు. మన హాస్పిటల్ కి వచ్చిన ఈ అవార్డు ల ప్రోత్సహం తో మేము మరిన్ని సేవలు అందించే ప్రయత్నం చేస్తాము అని ఆయన అన్నారు. నిరుపేదల వైద్యం కోసం 3కోట్ల రూపాయలు ట్రస్ట్ కు కేటాయించామని ఆయన పేర్కొన్నారు.

మన హాస్పిటల్ కు 6 వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది అన్నారు. 2011లో 13 వ స్థానం నుంచి 2020నాటికి 6 వ స్థానానికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేసారు. దీనిని మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను అని ఆయన తెలిపారు. అధునాతన పరికరాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారకం హాస్పిటల్ సేవలు అందిస్తుందని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version