ఆసియా కప్ 2022 లో ఫెయిల్యూర్.. ద్రవిడ్ పై BCCI వేటు !

-

ఎన్నో అంచనాలతో హాట్ ఫేవరెట్ గా ఆసియా కప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా అనూహ్యంగా కనీసం ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. లీగ్ దశలో రెండింటికి రెండు మ్యాచ్ లు గెలిచిన రోహిత్ సేన కీలక సూపర్ ఫోర్ లో వరుసగా రెండు మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ పై భారీ విజయనందుకున్న ఫలితం లేకుండా పోయింది. ప్రపంచ కప్ ముందు ఈ పరాజయం టీమిండియా లోపాలను ఎత్తి చూపింది.

అయితే ఆసియా కప్ లో దారుణంగా విఫలమైన టీమిండియా పెర్ఫామెన్స్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ వైఫల్యం పై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైశా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. మిడిల్ ఓవర్లలో స్లో బ్యాటింగే భారత జట్టును దెబ్బతీసిందని తమ సమీక్షలో గుర్తించారని, కోచ్ రాహుల్ ద్రవిడ్ ను కూడా మందలించారని తెలిపింది. టీ 20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని బోర్డు పెద్దలు టీం మేనేజ్మెంట్ కు సూచించారని ఓ బీసీసీఐ అధికారి తమకు వెల్లడించాడని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version