ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును తాజాగా ప్రకటించింది. టెస్టు మ్యాచ్‌లో ఆడనున్న 11 మంది ప్లేయర్ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. శుబ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌లు కొత్తగా టెస్టుల్లో ఆడుతుండగా, ఇటీవల గాయం బారిన పడిన రవీంద్ర జడేజా ఎట్టకేలకు తుది 11 మంది జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
కాగా విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్ తీసుకున్న నేపథ్యంలో అతనికి బదులుగా అజింక్యా రహానె కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే తొలి టెస్టులో భారత్ దారుణ ఓటమి అనంతరం రెండో టెస్టుపై భారత అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మొదటి టెస్టు మ్యాచ్‌లో దారుణంగా విఫలం అయిన పృథ్వీ షా స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించారు. గిల్ రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసినందునే అతనికి ఈ అవకాశం కల్పించారు. ఇక గిల్‌తోపాటు మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయనున్నారు. ఇక హనుమ విహారికి 4వ స్థానానికి ప్రమోషన్ లభించగా మొదటి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన వృద్ధిమాన్ సాహాకు బదులుగా వికెట్ కీపర్ పంత్‌ను ఈసారి జట్టులోకి తీసుకున్నారు. కాగా బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్‌కు తోడుగా జడేజా స్పిన్ వేయనున్నాడు. అలాగే ఉమేష్ యాదవ్, బుమ్రా, సిరాజ్‌లు పేస్ బౌలింగ్ చేయనున్నారు.