భారత్ లో ఇప్పుడు బాయ్ కాట్ చైనా అనే ఉద్యమం కాస్త బలంగా జరుగుతుంది. దేశ భక్తులు మన దేశంలో ఎక్కువగా ఉండటంతో చైనా ఉత్పత్తులను వాడుతూనే చైనా కంపెనీలను బ్యాన్ చేయాలి అంటూ జూమ్ వంటి యాప్స్ లో పిలుపునిస్తున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్థ కొంత వరకు మన మీద ఆధారపడింది. దీనితో ఇప్పుడు చైనా కంపెనీలు అన్నీ కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచన చేస్తున్నాయి.
అంత వరకు బాగానే ఉంది ఈ ఏడాది జరిగే ఐపిఎల్ నుంచి వివోని తప్పించారు. దీనితో మిగిలిన కంపెనీలు కూడా కాస్త కంగారు పడుతున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ఏడాది ఐపిఎల్ యాడ్స్ విషయంలో వెనక్కు తగ్గాయి కొన్ని కంపెనీలు. దీనితో ఐపిఎల్ ని ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ రూ. 400-500 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. చైనాకి చెందిన వివోతో పాటు ఒప్పో, రియల్ మీ, లెనోవో, షియోమి, హువావే సహా మరి కొన్ని కంపెనీలు తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వీవో ఒప్పో గత ఏడాది 240 కోట్ల యాడ్స్ ఇచ్చాయి.