ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టుడే చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలో 66 శాతం మంది ప్రజలు వచ్చేసారి కూడా మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నట్లు సర్వేలో తెలిసింది. అయితే ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓటేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేవలం 5 శాతం మందే ఓటు వేయడం గమనార్హం. కాగా, ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా..
హోం మినిష్టర్ అమిత్ షా 4 శాతం, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ 3 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 3 శాతం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2 శాతం, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 2 శాతం, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే, మాయావతి 1శాతం ఓట్లు సాధించారు. అలాగే దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఏఏపీ), మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్ నిలవగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.