టెస్ట్ కెప్టెన్ నియామకంపై బీసీసీఐ ఛీఫ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

-

భారత జట్టు టెస్ట్ కెప్టెన్ పై బీసీసీఐ ఛీఫ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జట్టు కొత్త కెప్టెన్ ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. తాను సెలక్షన్ కమిటీలో కూర్చుని సెలక్టర్లని ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపనల్ని దాదా ఖండించారు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదని… తానేమి నేరుగా బోర్డ్ అధ్యక్షుడిని కాలేదని ఆయన అన్నారు. 400పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని గంగూలీ సూచించారు. 

ఇదిలా ఉంటే… విరాట్ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్ గా తప్పించినప్పటి నుంచి బీసీసీఐకి కోహ్లీకి చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీని తప్పించి వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించారు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ తరువాత టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఈ వివాదంలోకి గంగూలీని కూడా లాగారు. గంగూలీ ఒత్తడి మేరకే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడనే రూమర్లు వినిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version