నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది? కేసీఆర్ పై షర్మిల ఫైర్

-

వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా అలాగే.. మీడియా సమావేశం నిర్వహించి.. సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరుగుతున్నారు. టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ ను ఎండగడుతున్నారు. ఇక తాజాగా మరోసారి కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు షర్మిల. నా చావుతోనైన నిరుద్యోగుల ఆత్మహత్యలు అగిపోవాలని మీకు ఇంకెంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలి కెసిఆర్ గారు? అని నిలదీశారు.

ఇంకెంతమంది కన్నతల్లులు కడుపుకోతను అనుభవిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు?త్వరలో ఉద్యోగాలు అని ఇంకా ఎన్ని ఏండ్లు జరుపుతారు?మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది? అని ఫైర్‌ అయ్యారు. నోటిఫికేషన్స్ రాక,ఇంత చదువు చదివి కూలిపని చేస్తున్నావు అనే మాటల అవమానాన్ని భరించలేక తల్లిదండ్రులకు భారం కాలేక పురుగులమందు తాగి తమ్ముడు కురుమూర్తి నిన్న ఆత్మహత్య చేసుకోవడం ఏ మనిషినైనా కదిలిస్తుంది కాని KCRని కాదని… ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు నింపవా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version