నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్న బీసీసీఐ

-

ఐపీఎల్-2024 సీజన్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో బీసీసీఐ షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది.ఎన్నికల నేపథ్యంలో తొలి 15 రోజుల మ్యాచ్ల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఇక ఫైనల్‌ మ్యాచ్ మే 26న నిర్వహించేలా బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

 

అయితే నేడు ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ విడుదల కాదని తెలుస్తోంది. దేశంలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 15 రోజుల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తేదీలు వచ్చాక.. మిగతా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ఉన్నా.. లీగ్ మొత్తం ఇండియా లోనే జరుగుతుందని ఐపీఎల్, బీసీసీఐ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇక ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించాలని లీగ్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version