అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా ఓడిపోయిన తర్వాత వై వి సుబ్బారెడ్డి గారితో సహా ఎవరు ఆ పార్టీలో కొనసాగరని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అసెంబ్లీలో రెండింట మూడవ వంతు మెజారిటీ వచ్చేస్తే చాలమ్మా వైవి… ఏడు ఎనిమిది మంది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు అని అన్నారు. 11 మందిని మీ వాడే ఇచ్చేస్తారేమో తెలియదని అన్నారు. బీజేపీలోకి వెళ్తారా?, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే టీడీపీలోకి వెళ్తారా?? అన్నది పక్కన పెడుదామని ఆయన అన్నారు.
త్వరలోనే వైకాపా రాజ్యసభ పక్షం పూర్తిగా ఖాళీ అవుతుందేమోనని నీ వెకిలి మాటలు చూస్తే అర్థమవుతుందని వై. వి. సుబ్బారెడ్డి గారిపై రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత వై వి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ… రాజ్యసభలో టీడీపీని ఖాళీ చేశామని పేర్కొనడం పట్ల రఘురామకృష్ణ రాజు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీ కొత్తగా ఖాళీ చేయడం ఏమిటని, అసెంబ్లీలో 151 స్థానాలు, పార్లమెంట్లో 23 స్థానాలు గెలిచినప్పుడే ఏదో ఒక దశలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోతుందని తెలిసిపోయిందన్నారు.