‘వచ్చే 45 రోజులు జాగ్రత్త ‘ : పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే 45 రోజులు జాగ్రత్త అని వైసీపీ గూండాయిజానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు భయపడవద్దు అని సూచించారు. జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ….వైసీపీ క్రిమినల్స్, గూండాలకు హెచ్చరిక పంపారు. మీరు మా సభలపై గానీ, నాయకులు, కార్యకర్తలపైన గానీ, సామాన్యులపైన గానీ దాడిచేస్తే, భయపెడితే, బెదిరిస్తే నేను మాట ఇస్తున్నా. మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం’ అని హెచ్చరించారు.

సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు యుద్ధం ఇద్దామని టీడీపీ-జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారు? గాయాలు, వేదనలు తప్ప అని విమర్శించారు. ఈ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్ మోసం చేశారు అని మండిపడ్డారు. అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ కు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని పవన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version