రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకం: చంద్రబాబు నాయుడు

-

వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ‘టీడీపీ-జనసేన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశాయి అని అన్నారు.. జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని ప్రజలు తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేతులు కలిపాం. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పారు. రాష్ట్రాన్ని బాగుచేయాలన్న సంకల్పంతో మేం ముందుకెళ్తున్నాం’ అని స్పష్టం చేశారు.

ఉండవల్లి ప్రజావేదికను కూల్చి సీఎం జగన్ తన పరిపాలన ప్రారంభించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు కాని సీఎం జగన్ విధ్వంసంతో ప్రారంభించారు అని విమర్శించారు. మంచి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం అని తెలిపారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం కానీ సీఎం జగన్ ఐదేళ్లు ఏం చేశారు? కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విభజించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version