పార్కులో ఎంజాయ్ చేసిన ఎలుగుబంటి పిల్ల‌లు.. వైర‌ల్ వీడియో..!

-

ఏం.. కేవ‌లం మ‌నుషుల‌కు మాత్రమే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఎంజాయ్‌మెంట్ కావాలా..? జ‌ంతువుల‌కు అవ‌స‌రం లేదా..? అవి రిలాక్స్ కావ‌ద్దా..? అని అనుకున్నాయో.. ఏమో.. తెలియ‌దు కానీ.. ఆ ఎలుగుబంటి, త‌న 5 పిల్ల‌ల‌తో క‌లిసి ఓ ఇంటి వెనుక భాగంలో ఉన్న తోట‌లో కాసేపు స‌ర‌దాగా గ‌డిపాయి. ఆ ఎలుగుబంటికి చెందిన పిల్ల‌లు అక్క‌డే ఉన్న జారుడు బ‌ల్ల‌పై జారుతూ ఆట‌లాడుకున్నాయి. ఇక త‌ల్లి ఎలుగుబంటి వాటి ఆట‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేసింది.

ఏంటీ.. న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదా.. అయితే పోస్టులో ఇచ్చిన వీడియోను గ‌మ‌నించండి. మీకే తెలుస్తుంది. చూశారు క‌దా.. ఆ ఎలుగుబంటి, దాని పిల్ల‌లు ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో. అవును.. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని నార్త్ క‌రోలినాలో చోటు చేసుకుంది. ఓ ఇంటి వెనుక భాగంలో ఉన్న తోట‌లో ఏర్పాటు చేసిన ఆట వ‌స్తువుల‌తో అలా ఆ ఎలుగుబంటి పిల్ల‌లు ఆడుకున్నాయి. అదే స‌మయంలో తీసిన ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం మ‌రొక‌టి ఉంది. అదేమిటంటే.. ఆ ఎలుగుబంటికి చెందిన ఐదు పిల్ల‌ల్లో 3 మాత్ర‌మే ఆ ఎలుగుబంటికి చెందిన‌వ‌ట‌. మిగిలిన రెండు పిల్ల‌లు వేరే ఎలుగుబంటివ‌ట‌. వాటికి త‌ల్లి లేక‌పోవ‌డంతో ఆ పిల్ల‌ల‌ను కూడా ఈ ఎలుగుబంటి వ‌ద్దే చేర్చారు. అయిన‌ప్ప‌టికీ ఈ ఎలుగుబంటి వాటిని కూడా త‌న పిల్ల‌ల్లాగే చూసుకుంటోంది. అవును మ‌రి.. ఎంతైనా త‌ల్లి ప్రేమ త‌ల్లి ప్రేమే క‌దా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version