ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఎలుగుబంటి…! వీడియో వైరల్…!

-

సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని కొన్ని వింతలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే వింతలు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. చిరుత పులి, ముళ్ళ పంది, కొండ చిలువ, ఎలుగు బంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇక నెటిజన్లు కూడా అవి వింతగా ఉండటంతో సోషల్ మీడియాలో ఎక్కువగా వాటిని వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది. ఒక ఎలుగు బంటి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ను ఊపేస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఎలుగు బంటి డాన్స్ చేస్తూ ఉంటుంది. డ్యాన్సింగ్ స్టార్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో చెట్టుకి దాని వీపు రుద్దుకుంటూ కాళ్ళు ఆడిస్తుంది… ఇది చూడటానికి డాన్స్ లా ఉంది. ఇక అది డాన్స్ చేస్తున్న సమయంలో దాని హావ భావాలు కూడా జంతు ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ట్విట్టర్ లో ఈ వీడియో ఒక ఊపు ఊపేస్తుంది… ఇప్పటి వరకు పలు ఖాతాల్లో దాదాపు పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 11 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ట్విట్టర్ లో ఉన్న ఈ ఎలుగు బంటితో తాము ప్రేమలో పడ్డామని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ సమయం మాత్రమే ఉన్న వీడియో ఎలుగు బంటి డాన్స్ చూసి… ఏదోక బాలివుడ్ సినిమాలో దానికి అవకాశం ఇవ్వాలని. అప్పుడు అది మరింత మంచి డాన్సర్ అవుతుందని వ్యాఖ్యానిస్తుంది. ఇది ఖచ్చితంగా మా శుక్రవారం మంచిగా చేసిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version