వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తప్పించుకోవడానికి చిట్కాలు..

-

దేశంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాలను తాకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వర్షాకాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు మొదలగునవి ఎక్కువగా బాధపెడుతుంటాయి. అందుకే వానాకాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అలా వ్యాపించకుండా ఉండాలంటే చర్మాన్ని రెండు మూడు సార్లు శుభ్రపర్చుకోవాల్సి ఉంటుంది. అదీగాక తేమ కారణంగా చర్మంలోని లోపలి పొర పొడిగా మారే అవకాశం ఉంది. అందుకని చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఇంకా పొడిబట్టల్లు ధరించాలి. వర్షాకాలంలో బట్టలు తొందరగా ఆరిపోవు. అలా అని అలాగే ధరిస్తే చర్మంపై దద్దుర్లు వస్తాయి.

నిర్లక్ష్యం చేస్తే చర్మం అంతటా వ్యాపిస్తాయి. అందుకే తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా తడిసిన బట్టలు ధరించరాదు. పూర్తిగా పొడిగా మారిన తర్వాత మాత్రమే ధరించాలి. చర్మాన్ని ఎలా శుభ్రపర్చుకుంటామో తలను కూడా అలాగే శుభ్రపర్చాలి. లేదంటే తలమీద కూడా మొటిమలు ఏర్పడే అవకాశం ఎక్కువ. వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం ఉత్తమం.

నీళ్ళు ఎక్కువగా తాగాలి. వాతావరణంలో తేమ ఉండడం వల్ల దాహం ఎక్కువ వేయదు. అలా అని తాగకుండా ఉండడం కరెక్ట్ కాదు. కావాల్సినన్ని నీళ్ళు శరీరానికి అందకపోతే డీహైడ్రేట్ అయ్యి ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ వల్ల ఆహార పదార్థాలపై ఫంగస్ ఏర్పడుతుంది. కొద్దిగా ఫంగస్ వచ్చినా పక్కన పెట్టేయడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version