రైతుకు బేడీలు.. అధికారులను బలిపశువును చేసిన రేవంత్ రెడ్డి : కేటీఆర్

-

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.ప్రతిరోజూ ఏదో టాపిక్ మీద ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా లగచర్ల ఘటనలో అరెస్టైన రైతుకు బేడీలు వేయడంపై ఆయన ‘ఎక్స్’ద్వారా స్పందించారు.ఈ క్రమంలోనే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట.. జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనట..

Revanth-KTR
Revanth-KTR

వారి కుటుంబసభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట..నెల రోజులుగా వారికి చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఒకేనట.. గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ఒకేనట.. చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న రేవంత్, నీ నిజరూపం రాష్ట్రంలోని పేదలందరికీ తెలిసిపోయిందని’ ఘాటు విమర్శలు చేశారు.ఇకనైనా క్షమాపణ చెప్పి వారిపై కేసులు రద్దు చేయాలని, రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news