మూసీ ప్రక్షాళన కంటే ముందు, నీ నోటిని ప్రక్షాళన చేసుకో.. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఫైర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సున్నాలు, కన్నాలు వేసే రేవంతూ.. నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని   ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది .

ముందు నీకు కొన్ని ప్రశ్నలు

1. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,500 కోట్లు.. ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లు?

 

2. అదే ప్రాజెక్టుకు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ. 16,500 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు?

 

3. పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి?

 

4. మొదట మూసీ సుందరీకరణకు రూ. 50,000 కోట్లు అవసరమని నువ్వే అన్నావ్.. ఇప్పుడు అదే నోటితో రూ. 1,50,000 కోట్లు కావాలి అంటున్నావ్. అది నోరా.. లేక మోరా?

 

5. 3-4 నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగింది. ఈ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా?

 

6. పనులు మొదలవ్వకముందే అంచనాలు పెంచి.. ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగ తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి. ఈ మూసీ ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా?

గుంపు మేస్త్రి.. మూసీ ప్రక్షాళన కంటే ముందు, నీ నోటిని ప్రక్షాళన చేసుకో. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటికొచ్చింది ఒర్రకు. ఇట్లనే ఒర్రుకుంటు పోతే రంగు పడుద్ది అని బీఆర్ఎస్ మండిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version