ప్రతి ఒక్కరూ పెళ్ళికి ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి లేదంటే పెళ్లయిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. త్వరలో మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకు పోవాల్సి వస్తుంది.
నచ్చనివి తెలుసుకోండి:
మీకు నచ్చనివి చెప్పి మీ పార్ట్నర్ కి నచ్చని విషయాల గురించి కూడా మీరు కనుక్కోండి.
ఎలా డబ్బులు ఖర్చు చేస్తారు:
మీరు ఎలా డబ్బులు ఖర్చు చేస్తారో మీ పార్టనర్ ఎలా డబ్బులు ఖర్చు ఇస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి లేకపోతే ఇది సమస్యలని తీసుకువస్తుంది.
పిల్లల గురించి:
పెళ్లి తర్వాత పిల్లలపై మీ అభిప్రాయాన్ని వారితో చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు కనుక్కోవాలి.
నచ్చినవి:
తప్పక మీ ఇష్టాలు మీ జీవిత భాగస్వామి ఇష్టాలు తెలిసి ఉండాలి.
ఎలా ఉండాలనుకుంటున్నారు:
పెళ్లి తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది వారికి తెలియాలి అలానే వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మీకు తెలియాలి.
మీరు ఎటువంటి వాతావరణం లో పెరిగారు:
మీరు ఎటువంటి వాతావరణం లో పెరిగారు అనేది మీ జీవిత భాగస్వామికి కచ్చితంగా తెలియాలి లేదంటే భవిష్యత్తులో ఇది కూడా ఇబ్బందిని తీసుకువస్తుంది. చూశారు కదా ఎటువంటి విషయాలు పెళ్లి కి ముందు తెలుసుకోవాలి మాట్లాడుకోవాలి అనేది… మరి కచ్చితంగా ఈ విషయంలో ఫెయిల్ అవ్వద్దు లేదంటే జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది.