తెర వెనక అతిపెద్ద కథ నడిపిస్తున్న జగన్ – మోడి ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం జరిగిందని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అప్పట్లో అనేకసార్లు యూపీఏ సర్కారుపై సీరియస్ అవ్వటం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అన్యాయమని తెలపడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో యూపీఏ సర్కార్ నిర్వహించిన సందర్భంలో ఐదు సంవత్సరాలు ఇవ్వాలని విభజన బిల్లులో పెట్టగా కాదు పది సంవత్సరాలు ఇవ్వాలి అంటూ అప్పుడు బిజెపి పార్లమెంటులో ఏపీ తరుపున మాట్లాడటం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసినదే.

అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తీసుకురావాలంటే వైసీపీ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ఏపీ ప్రజలను కోరడం జరిగింది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన వైయస్ జగన్ ఎంపీల స్థానంలో కూడా భారీగా గెలవడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అది ముగిసిన అధ్యయనం మని కేంద్రమంత్రి తెలపడం జరిగింది. దీంతో అధికారం లోకి వస్తాను ప్రత్యేక హోదా తెస్తాను అని మాట ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరించిన విధానాన్ని ఎండగడుతూ ప్రధానికి లెటర్ రాయడం జరిగింది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్ని విషయాలు మాట్లాడిన జగన్ లెటర్ లో బీజేపీ పదేళ్లు ప్రత్యేక హోదా ఏపీ ఇవ్వాలి అని చెప్పిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడగలేక పోతున్నారని జగన్ ఎందుకు దాస్తున్నారు..? అసలేమైంది అని ప్రతిపక్షాలు జగన్ మోడీ కి రాసిన లెటర్ పై ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది మోడీ – జగన్ తెరవెనుక ఆడుతున్న నాటకమని కేవలం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై స్పెషల్ స్టేటస్ విషయంలో వ్యతిరేకత రాకుండా నామ్ కె వాస్తు గా జగన్ లెటర్ రాయడం జరిగింది అని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version