స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఎప్పటినుండో చంద్రబాబు పై పోరాటం చేస్తూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయాలలో చంద్రబాబుని ఇరుకున పెట్టే విధంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ జగన్ పార్టీలో ఉంటూ అడపాదడపా కనిపిస్తూ వస్తోంది. ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో కీలకంగా రాణించిన లక్ష్మీపార్వతి..ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.
గతంలో ఒకసారి చంద్రబాబుకి ఆదాయం మించి ఆస్తులు ఉన్నాయని పూర్తి ఆధారాలతో సహా కోర్టులో ఆమె పిటిషన్ వేసినట్లు వార్తలు వచ్చాయి. రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించారు ఇంకా అనేక విషయాల గురించి లక్ష్మీపార్వతి కోర్టుకు ఫిర్యాదు చేసి ఆస్తుల జాబితాలో ఆధారాలతో సహా చంద్రబాబు గుట్టు మొత్తం బయట పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా హెరిటేజ్ ఈ విషయంలో చంద్రబాబు గతంలో ఒకసారి ఆ కంపెనీ నుంచి సొమ్ము తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలపగా తర్వాత మరొక సారి ఒక నెల మాత్రమే హెరిటేజ్ సంస్థ నుండి జీవితం తీసుకున్నట్లు రాజకీయాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఆ పాయింట్ ని పట్టుకున్న లక్ష్మీపార్వతి చంద్రబాబు హెరిటేజ్ నుంచి జీతం తీసుకోక, వేరే ఆదాయ మార్గాలు లేక ఎలా వేల కోట్లను సంపాదించారని ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ దగ్గర నుండి ఒక పైసా కట్నం కూడా తీసుకోలేదని చెప్పు వచ్చిన చంద్రబాబు తనకున్న రెండెకరాల తో ఎన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని ఏసీపీ న్యాయస్థానాన్ని లక్ష్మీ పార్వతి ఆశ్రయించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ అయింది. చాలా రోజుల తర్వాత లక్ష్మీపార్వతి ఆంధ్ర రాజకీయాల్లో తెరపైకి రావడంతో చంద్రబాబుపై ఏసీబీ కోర్టు కి ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.