నవ్వు వస్తే నవ్వడం మంచిదే. నవ్వండి, సంతోషంగా గడపండి, అంతేకాని ఇలా నవ్వితే మాత్రం నాలుగు విధాలుగా నష్టపోతారు అనే కంటే ఇంకొక విధంగా కూడా నష్టపోతారు. ఏంటి ఆ ఇంకో విధం అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా. women scream, ఈ సంఘటన వింటే మాత్రం మీరు నవ్వే ముందు తప్పకుండా అలోచించి మరీ నవ్వే పరిస్థితి ఏర్పడుతుంది. సరే అసలు విషయంలోకి వెళ్తే..
కొంతమంది ఎంత పెద్ద జోక్ వేసినా చిన్న స్మైల్ ఇచ్చి వదిలిస్తారు. మరికొంత మంది చిన్న జోక్ కి కూడా పగలబడి నవ్వుతారు ఇదే తరహాలో చైనాలో ని ఓ మహిళా తన స్నేహితులతో ప్రయాణిస్తూ ఓ జోక్ ని బిగ్గరగా నవ్వేసింది. ఈ నవ్వు విని అందరూ ఆశ్చర్యపోయారు కూడా అయితే ఒక్క సారిగా ఆమె నవ్వుతూ ఉండగానే ఆమె దవడ అలాగే నోరు తెరుచుకుని ఉండిపోయింది.
ఒక్కసారిగా ఈ పరిణామమతో స్నేహితులు కంగారు పడిపోయారు. ఆమె నోరు మూసుకోలేక, అలాగే ఉండిపోయి నరకం అనుభవించింది. సుమారు గంట పాటు నరకయాతన పడిన ఆమెని అదృష్ట వశాత్తు. అదే ట్రైన్ లో ఉన్న ఓ ప్రముఖ డాక్టర్ పరీక్షించి ఆమె బిగ్గరగా నవ్వడంతో దవడ ఎముకలు పక్కకి జరిగిపోయాయని చెప్పి తాత్కాలికంగా వైద్యం చేశారు. ఆ తరువాత ఆసుపత్రికి తరలించగా ఆమె దవడ యదాస్థానానికి వచ్చి మాట్లాడగలుగుతోంది. అయితే ఇంకొక సారి ఇలానే నవ్వితే ఆపరేషన్ పడే అవకాశం ఉంటుందని వైద్యులు సున్నితంగా హెచ్చించారట.