ప్రసాదంగా “అర‌టి పండు హ‌ల్వా”.. ఇలా చేయండి..!

-

అరటి పండ్లు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాల‌ను అందిస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. అరటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. అయితే కేవలం అర‌టి పండ్లును కేవ‌లం పండ్లుగానే కాక వాటితో వంటలు చేసుకుని కూడా తినవచ్చు. ముఖ్యంగా ఆ పండ్లతో చేసే హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. మరి అరటి పండు హ‌ల్వాను ఎలా తయారు చేయాలో, అందుకు కావలసిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

అరటి పండు హల్వా తయారీకి కావలసిన పదార్థాలు:

పెద్ద అర‌టి పండ్లు – 6
చ‌క్కెర – రెండున్న‌ర క‌ప్పులు
నెయ్యి – ఒక‌టింపావు క‌ప్పు
జీడిప‌ప్పు – 50 గ్రాములు
మైదాపిండి – ఒక‌టింపావు క‌ప్పు
వెనీలా ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్

అర‌టి పండు హల్వా త‌యారు చేసే విధానం:

అర‌టి పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌.. అర‌టి పండు ముక్క‌లు వేసి బాగా వేయించాలి. ముక్క‌లు చ‌ల్ల‌రాక బాగా మెత్త‌గా న‌లుపుకోవాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మంలో మైదాపిండి, మిగిలిన నెయ్యి, చ‌క్కెర వేసి పిండిని బాగా క‌ల‌పాలి. చ‌క్కెర పాకం వ‌చ్చాక అందులో జీడిప‌ప్పు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానిపై నెయ్యి పూత‌లా పూయాలి. అనంత‌రం హ‌ల్వాలా త‌యారైన స్వీటును ప్లేట్‌లో పోసి వెడ‌ల్పుగా చేసుకోవాలి. అనంత‌రం మ‌న‌కు కావ‌ల్సిన సైజ్‌లో హ‌ల్వాను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. అంతే.. రుచిక‌ర‌మైన అర‌టి పండు హ‌ల్వా త‌యారైపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news